అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మినియాపొలిస్ పట్టణంలో శనివారం ఉదయం జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు. గాయపడిన 10 మందిలో ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నట్లు పోలీసు శాఖ ట్విట్టర్లో తెలిపింది.
ఇద్దరు సాయుధులైన దుండగులు జనావాసాల్లోకి వచ్చి అకారణంగా గొడవ పెట్టుకున్నారని.. వెంటనే కాల్పులు మొదలుపెట్టినట్లు పోలీసు అధికార ప్రతినిధి వివరించారు.