Shooting in America: అమెరికా, మిస్సోరీ రాష్ట్రంలోని నైరుతి నగరం జోప్లిన్లో మంగళవారం కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా అనుమానితుడు మృతి చెందారు. మరో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అసిస్టెంట్ పోలీస్ చీఫ్ బ్రియాన్ లేవిస్ తెలిపారు.
అమెరికాలో కాల్పుల కలకలం.. పోలీస్ సహా దుండగుడు మృతి
Shooting in America: అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం సృష్టించాయి. మిస్సోరీ రాష్ట్రంలోని జోప్లిన్ నగరంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. మరో ఇద్దరు అధికారులకు తూటాలు తగిలాయి.
నార్త్పార్క్ క్రాసింగ్ షాపింగ్ కేంద్రంలోని ఓ స్టోర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయని మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులపై దుండగుడు కాల్పులు జరిపాడు. ఇద్దరు పోలీసు అధికారులకు తూటాలు తగిలాయి. దుండగుడు పోలీసు కారును దొంగిలించి అక్కడి నుంచి పారిపోయాడు. కొద్ది దూరం వెళ్లాక కారును వదిలేసి పరుగు అందుకున్నాడు. అతన్ని వెంబడించిన పోలీసులు.. సెంట్రల్ జోప్లిన్ ప్రాంతంలోకి చేరుకోగా ఓ అధికారి, దుండగుడిపై కాల్పులు జరిపారు.
ఇదీ చూడండి:ఆ విద్యార్థులకు ఊరట.. సుమీ నుంచి తరలింపు ప్రారంభం