బ్రెజిల్లో నవంబర్ 13-14న జరిగే వార్షిక 'బ్రిక్స్' సదస్సుకు ప్రధాని నరేంద్రమోదీ హజరుకానున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ బ్రిక్స్ సదస్సులో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు భాగస్వాములగా ఉన్నాయి.
సభ్య దేశాల మధ్య సహకారాన్ని మెరుగుపరచుకునే దిశగా ఈ సదస్సులో చర్చలు జరగనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (ఎకనామిక్ రిలేషన్స్) టీఎస్ తిరుమూర్తి తెలిపారు.