నాలుగు రోజుల పర్యటనలో(Modi Us Visit 2021) భాగంగా అమెరికాకు వెళ్లినభారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ బిజీబిజీగా గడపనున్నారు. తొలిసారి నేరుగా నిర్వహిస్తున్న క్వాడ్ సదస్సులో పాల్గొననున్నారు. క్వాడ్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలపై సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి 76 వార్షిక సదస్సులో ప్రసంగించనున్నారు. మోదీ పర్యటన(Modi Us Visit 2021) ఎలా సాగనుందంటే..
(భారత కాలమానం ప్రకారం- గంటల్లో)
గురువారం(సెప్టెంబర్ 23)
- రాత్రి 7:15- క్వాల్కామ్ సీఈఓ క్రిస్టియానో ఆర్ అమోన్‌తో మోదీ భేటీ.
- రాత్రి 7:35- అడోబ్ ఛైర్మన్ శంతను నారాయణ్‌తో మోదీ సమావేశం.
- రాత్రి 7:55- ఫస్ట్ సోలార్ సంస్థ సీఈఓ మార్క్ విడ్మర్‌తో మోదీ భేటీ.
- రాత్రి 8:35- బ్లాక్‌స్టోన్ సీఈఓ స్టీఫెన్ ఏ స్క్వార్జ్మన్తో మోదీ భేటీ
- రాత్రి 11:00- ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్‌తో మోదీ ద్వైపాక్షిక సమావేశం.
శుక్రవారం(సెప్టెంబర్ 24)
- ఉదయం 12:45- అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌తో మోదీ ద్వైపాక్షిక సమావేశం జరగనుంది.
- ఉదయం 3:00- జపాన్ ప్రధాని యొషిహిదే సుగాతో మోదీ భేటీ కానున్నారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు.
- రాత్రి 8:30- పర్యటనలో అత్యంత కీలక ఘట్టమైన.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం వైట్‌హౌస్‌లో జరగనుంది. వీరి భేటీ గంటసేపు కొనసాగనుంది.
- రాత్రి 11:30- లంచ్ విరామం తర్వాత, ప్రధాని మోదీ వైట్‌హౌస్‌కు చేరుకుంటారు. అక్కడ జపాన్, అమెరికా, ఆస్ట్రేలియాలతో నిర్వహించే క్వాడ్ శిఖరాగ్ర సమావేశంలో(Quad Summit 2021) మోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమం రెండు గంటలపాటు కొనసాగనుంది.
శనివారం(సెప్టెంబర్ 25)
- రాత్రి 7:30- ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మోదీ ప్రసంగిస్తారు.
- రాత్రి 9:15- అమెరికా నుంచి దిల్లీకి మోదీ బయలుదేరుతారు.