పరిశుభ్రత ప్రాముఖ్యాన్ని మరోమారు చాటి చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలోనే కాదు విదేశాల్లోనూ పరిశుభ్రత కోసం తాను ఎప్పుడూ పాటుపడతానని.. తాను చెప్పే వాటిని ఆచరిస్తానని ప్రపంచానికి తెలియజేశారు మోదీ. హ్యూస్టన్లోని జార్జ్ బుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన చిన్న సంఘటన అందుకు నిదర్శనంగా నిలిచింది.
'హౌడీ మోదీ' కార్యక్రమం కోసం హ్యూస్టన్ వెళ్లిన మోదీ... జార్జ్ బుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఈ సందర్భంగా అమెరికా ప్రతినిధులు, భారత్లోని అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్, అమెరికాలో భారత రాయబారి హర్ష వర్ధన్ ష్రింగ్లా, ఇతర నేతలు ప్రధాని స్వాగతం పలికారు.
మోదీకి పుష్ప గుచ్ఛాన్ని అందించారు అమెరికా ప్రతినిధి ఒకరు. ఆ సందర్భంగా అందులోంచి కొన్ని పూలు కిందపడిపోయాయి. అందరిని ఆశ్చర్యపరుస్తూ ప్రధాని మోదీ కిందికి వంగి స్వయంగా ఆ పూలను తీసి సిబ్బందికి అందించారు. ఈ చర్యతో పరిశుభ్రతపై తనకు ఉన్న చిత్తశుద్ధిని ప్రపంచానికి చాటి చెప్పారు.