టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి చోటు దక్కించుకున్నారు. 2021కి గానూ అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాను బుధవారం విడుదల చేసింది టైమ్ మ్యాగజైన్. 18వ వార్షిక జాబితాలో మార్గదర్శకులు, కళాకారులు, నాయకులు, ఆవిష్కర్తలతోపాటు తదితరులు ఉన్నట్లు వెల్లడించింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ సహా బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాాలాకు కూడా చోటుదక్కింది.
ఈ జాబితాలో అత్యంత చిన్న వయస్కురాలిగా 18 ఏళ్ల జిమ్నాస్ట్ సునీసా లీ ఉండగా.. పెద్ద వయస్కుడిగా 78 ఏళ్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎంపికయ్యారు.