తెలంగాణ

telangana

ETV Bharat / international

దటీజ్ మోదీ... వైట్​హౌస్​ కూడా ఆయనకు ఫాలోవరే! - శ్వేతసౌధం అనుసరిస్తున్న ఏకైక విదేశీ నేత మోదీ!

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం... తన ట్విట్టర్​ ఖాతాలో అనుసరిస్తున్న ఏకైక విదేశీ నేతగా మోదీ నిలిచారు. కరోనాపై పోరాడుతున్న అమెరికాకు హైడ్రాక్సీక్లోరోక్విన్ సహా అవసరమైన ఔషధాలు అందించడానికి భారత్​ ముందుకొచ్చిన నేపథ్యంలో... మోదీని ఫాలో కావడం ప్రారంభించింది వైట్​హౌస్.

PM Modi becomes only world leader to be followed by WH on Twitter
శ్వేతసౌధం అనుసరిస్తున్న ఏకైక విదేశీ నేత మోదీ!

By

Published : Apr 10, 2020, 7:45 PM IST

భారత్​-అమెరికా మైత్రిని నూతన శిఖరాలకు చేర్చిన ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సాధించారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం... తన ట్విట్టర్​ ఖాతాలో అనుసరిస్తున్న ఏకైక విదేశీ నేతగా మోదీ నిలిచారు.

భారత్​ను అనుసరిస్తోంది..!

శ్వేతసౌధం తన ట్విట్టర్ ఖాతాలో మొత్తం 19 మందిని అనుసరిస్తోంది. వారిలో ప్రధాని నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి కార్యాలయం, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఉన్నారు. విశేషం ఏమిటంటే శ్వేతసౌధం అనుసరిస్తున్న అమెరికాయేతర నాయకులు వీరిద్దరు మాత్రమే.

అంతే కాకుండా, వైట్​హౌస్​ భారతదేశంలోని యూఎస్ రాయబార కార్యాలయాన్ని, వాషింగ్టన్​లో భారత రాయబార కార్యాలయాన్ని కూడా ట్విట్టర్​లో అనుసరిస్తోంది.

శ్వేతసౌధం అనుసరిస్తున్న విదేశీ నేత మోదీ!

ఔషధ సాయం తరువాత..

కరోనా ధాటికి అతలాకుతలం అవుతున్న అమెరికాను రక్షించుకునేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు. ప్రధాని మోదీకి నేరుగా ఫోన్​ చేసి హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్పథంలో స్పందించిన భారత్​... ఔషధాల ఎగుమతికి అంగీకరించింది.

భారత్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ట్రంప్... 'భారతదేశం చేసిన సాయం ఎన్నటికీ మరిచిపోలేము' అని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో... తమను ఆపత్కాలంలో ఆదుకున్న భారత్​పై అగ్రరాజ్యం అభిమానాన్ని చాటుకుంటోంది.

భారత్​పై ప్రశంసల వర్షం

కరోనాపై పోరులో తమకు అండగా నిలబడిన భారత్​పై... బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ సహా పలువురు ప్రపంచ నేతలు ప్రశంసల వర్షం కురిపించారు.

ఇదీ చూడండి:లక్షకు చేరువగా కరోనా మరణాలు.. స్పెయిన్​లో తగ్గుముఖం

ABOUT THE AUTHOR

...view details