తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రిక్స్ సదస్సు కోసం బ్రెజిల్ చేరుకున్న మోదీ - నేషనల్ న్యూస్ తెలుగు

బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు బ్రెజిల్ చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆ దేశ రాజధాని బ్రెసీలియా విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. సదస్సులో భాగంగా బ్రిక్స్​ దేశాధినేతలతో సమావేశం కానున్నారు ప్రధాని.

బ్రిక్స్ సదుస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ చేరుకున్న మోదీ

By

Published : Nov 13, 2019, 3:44 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ చేరుకున్నారు. 11వ బ్రిక్స్ సదస్సులో హాజరయ్యేందుకు వెళ్లిన ఆయనకు బ్రెసీలియాలో ఘన స్వాగతం లభించింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్​ బోల్సోనారోతో చర్చలు జరుపుతారు ప్రధాని.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​తోనూ వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు మోదీ. బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ ముగింపు వేడుక, బ్రిక్స్ ప్లీనరీ సెషన్లకూ హాజరుకానున్నారు. ఈనెల 15న సదస్సు ముగుస్తుంది.

ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా

ప్రపంచానికి సమస్యగా పరిణమించిన ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే బ్రిక్స్ సదస్సు ప్రధానంగా దృష్టి సారించిందని బ్రెజిల్ వెళ్లే ముందు చెప్పారు మోదీ. డిజిటల్ ఎకానమీ, శాస్త్ర, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించేందుకు బ్రిక్స్ దేశాలు కృషి చేస్తాయన్నారు.

బ్రిక్స్​

బ్రిక్స్​లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణ ఆఫ్రికా సభ్యదేశాలు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ఐదు దేశాల ఆర్థిక వ్యవస్థల మొత్తం జనాభా.. ప్రపంచ జనాభాలో 42 శాతం. ప్రపంచ స్థూల జాతీయ ఉత్పత్తిలో బ్రిక్స్​ వాటా 23 శాతం. బ్రిక్స్ సదస్సులో మోదీ పాల్గొనడం ఇది ఆరోసారి. మొదటిసారిగా 2014లో బ్రెజిల్​ ఫోర్టాలెజాలో జరిగిన సదస్సుకు హాజరయ్యారు.

బ్రెజిల్ చేరుకున్న మోదీ

ఇదీ చూడండి: 2 దేశాల సరిహద్దుల్లోని నది నెత్తుటిమయం.. ఎందుకు?

ABOUT THE AUTHOR

...view details