కంప్యూటర్లో ఆటలు ఆడుతూ ఆహారం తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందంటున్నారు పరిశోధకులు. ఆటలు ఆడుతూ తినడం వల్ల తక్కువ ఆహారం తీసుకుంటామని అమెరికాకు చెందిన అర్బనా-ఛాంపెయిన్‌లోని ఇల్లినాయీ విశ్వవిద్యాలయం చేసిన సర్వే తేల్చింది. సరిపడా తినకపోవడం వల్ల శరీరంలో పోషకాలు లోపిస్తాయని హెచ్చరించింది.
కంప్యూటర్ ఆటలు ఒక వ్యక్తి తీసుకునే పోషకాలపై ఎంతమేర ప్రభావం చూపుతాయో అని 119 మంది యువకులపై పరిశోధన చేశారు. ఎలాంటి పరధ్యానం లేని వారు 15 నిమిషాల సమయంలో తీసుకునే ఆహారంతో పోలిస్తే.. కంప్యూటర్లో ఆటలు ఆడుతూ తినే వారి ఆహార పరిమాణం గణనీయంగా తగ్గిందని చెప్పారు పరిశోధకులు.