అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ డకోటా రాష్ట్రంలో విమానం కూలిపోయి ఇద్దరు చిన్నారులు, పైలట్ సహా మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఛంబెర్లేయిన్ విమానాశ్రయం నుంచి గాల్లోకి ఎగిరిన పిలాటస్-12 సింగిల్ ఇంజిన్ టర్బోప్రోప్ విమానం కొద్దిసేపటికే కూలిపోయింది. విమానాశ్రయానికి సుమారు 2 కి.మీ దూరంలో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో విహంగంలో 12 మంది ప్రయాణిస్తున్నారు.