Plane hits Paraglider: అమెరికా హ్యూస్టన్లో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఓ తేలికపాటి విమానం.. పారాగ్లైడర్ను ఢీకొని నెలకొరిగినట్లు అధికారులు తెలిపారు.
పారాగ్లైడర్ను ఢీకొని కూలిన విమానం.. ఇద్దరు మృతి - కుప్పకూలిన విమానం
Plane hits Paraglider: పారాగ్లైడర్ను ఢీకొని తేలికపాటి విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన అమెరికాలోని హ్యూస్టన్ జరిగింది.
![పారాగ్లైడర్ను ఢీకొని కూలిన విమానం.. ఇద్దరు మృతి Plane crash](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13974864-thumbnail-3x2-planecrash.jpg)
Plane crash
సింగిల్ ఇంజిన్ సెస్నా 208 విమానం హ్యూస్టన్‌లోని బుష్ ఇంటర్‌కాంటినెంటల్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. టెక్సాస్‌లోని ఫుల్‌షీర్ సమీపంలో ఓ పారాగ్లైడర్ను ఢీకొని ఉదయం 9.40 గంటల సయమంలో కూలిపోయినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. విమానంలో ప్రయాణించిన వ్యక్తితోపాటు పారాగ్లైడర్ మరణించినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొంది.
Last Updated : Dec 22, 2021, 12:00 PM IST