రోజంతా పనిచేయడం వల్ల మనమీద బోలెడంత ఒత్తిడి పడుతుంది. అలాంటపుడు ఏదైనా సరదా వీడియో చూస్తే కాస్త ఉపశమనం దొరుకుతుంది. అదే చిన్న పిల్లల వీడియోలు చూస్తే ఎంతటి ఒత్తిడి అయినా ఇట్టే దూరమవుతుంది. మరి అలాంటి ఒత్తిడి తగ్గించే ఒక బుడతడి వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
Viral: ఈ బుడతడు.. డ్యాన్స్‌తో అదరగొట్టాడు - బుడతడి డ్యాన్స్ వైరల్ వీడియో
ఓ బృందంలోని పెద్దవాళ్లతో ఏమాత్రం తడబడకుండా డ్యాన్స్ చేశాడు ఓ బుడతడు. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. మీరూ ఈ వీడియో చూసేయండి మరి...
ఈ వీడియోలో చిన్న పిల్లాడు టీషర్ట్, షార్ట్, బూట్లు వేసుకుని, పార్క్‌లోని ఒక బృందంతో కలిసి చిందులేస్తున్నాడు. ఏమాత్రం తడబడకుండా పెద్దవాళ్లతో సమానంగా చేస్తున్న బుడతడి డాన్సుకు నెటిజన్లను ఫిదా అయిపోతున్నారు. అమెరికా బాస్కెట్ బాల్ మాజీ ఆటగాడు రెక్స్ చాప్మన్ ఈ వీడియోను ట్విట్టర్‌లో పంచుకోగా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరెందుకాలస్యం ఆ బుడతడి బుల్లి బుల్లి స్టెప్పులు చూసి మీరూ కాస్త రిలాక్స్ అయిపోండి..
ఇదీ చూడండి:Viral: చలానా తప్పించుకునేందుకు.. మహిళ పూనకం!