తెలంగాణ

telangana

Picasso: పికాసో చిత్రాలకు వేలంలో భారీ ధర!

ప్రముఖ చిత్రకారుడు పికాసో(Pablo Picasso) గీసిన చిత్రాలకు 110 మిలియన్‌ డాలర్ల ధర లభించింది. ఇవి 20 ఏళ్లుగా ఓ హోటల్‌ గదిలో ఉన్నాయి. లాస్‌వేగాస్‌లోని బెల్లాజియో హోటల్‌లో సౌత్‌బే ఆక్షన్‌ సంస్థ ఈ వేలం నిర్వహించింది. మొత్తం ఐదు చిత్రాలను ఈ వేలంలో విక్రయించారు. ఇక్కడ మరో 12 పికాసో చిత్రాలు కూడా ఉన్నాయి.

By

Published : Oct 24, 2021, 10:31 PM IST

Published : Oct 24, 2021, 10:31 PM IST

Picasso
పికాసో

ప్రపంచ ప్రఖ్యాత కళాకారుడు పికాసో(Pablo Picasso Artworks) గీసిన కళాఖండాలు భారీ ధర (Picasso Paintings Auction) పలికాయి. అమెరికాలోని లాస్ వేగాస్​లో నిర్వహించిన వేలంలో దాదాపు 110 మిలియన్ డాలర్లకు అమ్ముడయ్యాయి. రెండు దశాబ్దాలుగా ఓ హోటల్‌లో ప్రదర్శనకు ఉన్న వీటిలో.. ​దాదాపు 80 సంవత్సరాల క్రితం గీసిన కళాఖండాలూ (Pablo Picasso Famous Paintings) ఉండటం విశేషం. పికాసో 140వ పుట్టినరోజును పురస్కరించుకుని వేలాన్ని నిర్వహించినట్లు 'సోథీబే' తెలిపింది.

1938లో వేసిన 'వుమెన్‌ ఇన్‌ ఏ రెడ్‌-ఆరెంజ్‌' చిత్రానికి 40.5 మిలియన్‌ డాలర్ల ధర పలికింది. వాస్తవానికి అంచనావేసినదాని కంటే 10 మిలియన్‌ డాలర్లు అదనపు ధర లభించింది. మిగిలిన వాటిల్లో ఒక దానికి 24.4 మిలియన్‌ డాలర్లు, 9.5 మిలియన్‌ డాలర్లు, 2.1 మిలియన్‌ డాలర్లు చొప్పున ధర లభించింది. ఈ చిత్రాల కొనుగోలుదారుల పేర్లను మాత్రం ఆక్షన్‌ సంస్థ బహిర్గతం చేయలేదు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details