తెలంగాణ

telangana

ETV Bharat / international

భవనంలో అగ్నిప్రమాదం.. ఏడుగురు చిన్నారులు సహా 13 మంది మృతి

Philadephia house fire: ఓ భవనంలో చెలరేగిన మంటల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. భవనంలో నాలుగు స్మోక్ డిటెక్టర్​లు ఉన్నప్పటికీ.. ఒక్కటీ పనిచేయలేదని అధికారులు తెలిపారు.

Philadephia house fire
ఫిలడెల్ఫియా అగ్నిప్రమాదం

By

Published : Jan 5, 2022, 10:25 PM IST

Philadephia fire accident: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో మంటలు చెలరేగి 13 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అగ్నిప్రమాదం జరిగిన భవనం

US Fire accident killed children

ఫెయిర్​మౌంట్​ ప్రాంతంలో బుధవారం ఉదయం 6.40 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. భవనంలోని రెండో అంతస్తులో మంటలు చెలరేగాయాని వెల్లడించారు. 60 నిమిషాల లోపే మంటలను అదుపు చేసినట్లు చెప్పారు. భవనంలో నాలుగు స్మోక్ డిటెక్టర్​లు ఉన్నప్పటికీ.. ఒక్కటీ పనిచేయలేదని తెలిపారు.

ఘటనా స్థలిలో అగ్నిమాపక సిబ్బంది

భవనంలోకి ప్రవేశించేందుకు భారీ నిచ్చెనలను అగ్నిమాపక సిబ్బంది వినియోగించారు. గోడలకు భారీ రంధ్రాలు చేశారు. భవనంలో నుంచి ఓ చిన్నారిని బయటకు తీసి స్ట్రెచర్​పై తీసుకెళ్లినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది.

అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు

మేయర్ విచారం..

ప్రమాదంలో పిల్లలు మరణించడంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ ఇంటి సమీపంలో ఆడుకునేవారని, అలాంటిది వారు దుర్మరణం చెందడం బాధాకరమని స్థానికంగా నివాసం ఉండే డన్నీ మెక్​గీర్ చెప్పారు. ఘటనపై స్థానిక మేయర్ జిమ్ కెన్నీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన చిన్నారుల కోసం ప్రార్థించాలని అన్నారు.

ఇదీ చదవండి:మాస్కు ధరించమంటే.. బట్టలు విప్పేసి యువతి హల్​చల్

ABOUT THE AUTHOR

...view details