Pfizer Covid Pill : కొవిడ్-19 చికిత్సలో భాగంగా ఫైజర్ రూపొందించిన యాంటీవైరల్ ఔషధం 90శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తుది విశ్లేషణ ఫలితాల్లో వెల్లడైంది. ముఖ్యంగా వైరస్ ముప్పు అధికంగా ఉన్న బాధితులు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం, మరణం ముప్పు తగ్గించడంలో తమ ఔషధం 90శాతం సమర్థత చూపించిందని ఆ సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్‌పైనా ఆశాజనక ఫలితాలు ఇస్తున్నట్లు ల్యాబ్ పరిశోధన సమాచారం ద్వారా తెలుస్తోందని ఫైజర్ స్పష్టం చేసింది.
కొవిడ్ చికిత్స కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న రైటోనవిర్తో కలిపి కాంబినేషన్ రూపంలో తీసుకునే ఔషధాన్ని ఫైజర్ అభివృద్ధి చేసింది. ప్రయోగాల్లో భాగంగా దీనిని 2250 మంది బాధితులపై పరీక్షించారు. స్వల్ప లక్షణాలు ఉన్నవారితో పాటు ఊబకాయం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలున్న బాధితులు, వృద్ధులను పరిగణనలోకి తీసుకున్నారు.
మొత్తం వాలంటీర్లలో ప్లెసిబో తీసుకున్న వారిలో 12మంది మృతి చెందగా.. అసలైన ఔషధం తీసుకున్న వారిలో ఒక్క మరణం కూడా చోటుచేసుకోలేదని ఫైజర్ యాజమాన్యం వెల్లడించింది. తద్వారా ఫైజర్ ఔషధం ఆస్పత్రిలో చేరిక, మరణాల నుంచి 90శాతం సమర్థత చూపించిందని తెలిపింది. పాక్స్‌లోవిడ్ బ్రాండ్ పేరుతో ఈ యాంటీవైరల్ ఔషధాన్ని ఫైజర్ అందుబాటులోకి తేనుంది. వైద్యుల సూచన మేరకు ఈ ఔషధాన్ని రోజుకు రెండుసార్లు (12 గంటల వ్యవధి చొప్పున) ఐదు రోజుల పాటు తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రాణాలు కాపాడటమే ముఖ్యం..