కరోనా నివారణ కోసం ఫైజర్-బయోఎన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకా వచ్చే నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అంతా సానుకూలంగా జరిగితే క్రిస్మస్ కంటే ముందే టీకా పంపిణీ ప్రారంభిస్తామని బయోఎన్‌టెక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉగర్ సహిన్ వెల్లడించినట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.
టీకా ప్రయోగాలు పూర్తయినట్లు ఫైజర్, బయో ఎన్‌టెక్ బుధవారం ప్రకటించింది. ప్రయోగాల్లో దీని సామర్థ్యం 95 శాతం వరకు ఉందని తేలినట్లు సంస్థలు వెల్లడించాయి. అత్యవసర అనుమతుల కోసం అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ), యూరోపియన్ యూనియన్‌కు దరఖాస్తు చేసినట్లు ఉగర్ సహిన్ తెలిపారు.
"అంతా బాగా జరిగితే డిసెంబరు రెండో అర్ధభాగంలో అనుమతులు రావొచ్చని భావిస్తున్నాం. క్రిస్మస్‌కు ముందే టీకా పంపిణీ మొదలుపెడతాం. అయితే అంతా సానుకూలంగా జరిగితేనే"
- ఉగర్ సహిన్, బయోఎన్‌టెక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్