ఫార్మా దిగ్గజం ఫైజర్, బయోఎన్‌టెక్‌లు అమెరికాకు మరో పది కోట్ల డోసుల కరోనా టీకాను సరఫరా చేయనున్నాయి. ఈ మేరకు కొత్తగా ఒప్పందం చేసుకున్నాయి. జులై 31వ తేదీ వరకూ అన్ని డోసులను సరఫరా చేయనున్నట్లు ఫైజర్ ప్రతినిధులు తెలిపారు.
అమెరికాకు మరో 10 కోట్ల డోసుల ఫైజర్ టీకా - National Institutes of Health.
అమెరికాకు ఫైజర్, బయోఎన్‌టెక్ కలిసి మరో 10 కోట్ల డోసుల కొవిడ్ టీకాను సరఫరా చేయనున్నాయి. ఈ మేరకు కొత్త ఒప్పందం కుదిరింది. జులై 31లోపు టీకా పంపిణీ చేయనున్నట్లు ఫైజర్ ప్రతినిధులు స్పష్టం చేశారు.
అమెరికాకు మరో 10 కోట్ల డోసుల ఫైజర్ టీకా
ఇంతకుముందు పది కోట్ల డోసుల కరోనా టీకా సరఫరా చేసేందుకు ఫైజర్ ఒప్పందం చేసుకుంది. తాజా ఒప్పందంతో కలిసి మొత్తం 20 కోట్ల డోసుల కొవిడ్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనుంది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు వీలుగా మొట్టమొదటగా ఫైజర్ టీకాకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ-ఎఫ్‌డీఏ నుంచి అనుమతి లభించింది. ఆ తర్వాత మోడెర్నా టీకా అనుమతి పొందింది.
ఇదీ చూడండి: ఫైజర్ టీకా.. ఒక్కో దేశంలో ఒక్కో ధర