అమెరికన్ దిగ్గజ ఫార్మా సంస్థ ఫైజర్ మరో కీలక ముందడుగు వేసింది. బయో ఎన్‌టెక్ సంస్థతో కలిసి కరోనా వ్యాక్సిన్ రూపొందిస్తున్న ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ)కు దరఖాస్తు చేసింది. డిసెంబర్ ప్రారంభంలో పరిమిత సంఖ్యలో టీకా వినియోగానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
తమ వ్యాక్సిన్ కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని ఫైజర్ ఇటీవలే ప్రకటించింది. అత్యవసర వినియోగానికి టీకా అర్హత సాధించాల్సి ఉందని.. అంతా సవ్యంగా సాగితే తుది పరీక్ష పూర్తి కావడానికి ముందే ఎఫ్‌డీఏ అనుమతి మంజూరు చేస్తుందని ఆ సంస్థ తెలిపింది.
పంపిణీయే ప్రధాన సవాలు..