తెలంగాణ

telangana

ETV Bharat / international

టీకా​ అత్యవసర వినియోగానికి అనుమతి కోరనున్న ఫైజర్‌

కరోనా టీకాను అత్యవసర ప్రాతిపదికన ఉపయోగించేందుకు అమెరికా ప్రభుత్వం అనుమతి తీసుకోనుంది ప్రముఖ ఫార్మా సంస్థ ఫైజర్. జర్మనీకి చెందిన బయోటెక్​తో సంయుక్తంగా కొవిడ్​ టీకాను అభివృద్ధి చేస్తోంది ఫైజర్​.

Pfizer_Albert Bourla
'క్లినికల్​ ట్రయల్స్ అయ్యాకే ఫైజర్​ సంస్థ కొవిడ్​ వ్యాక్సీన్​ విడుదల'

By

Published : Oct 17, 2020, 8:43 AM IST

'అత్యవసర ప్రాతిపదికన' తాము ఆవిష్కరించిన కొవిడ్‌-19 టీకా వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలని అమెరికా ఫార్మా దిగ్గజమైన ఫైజర్‌ కోరనుంది. కొవిడ్‌- 19 టీకాను జర్మనీకి చెందిన బయోన్‌టెక్‌ అనే సంస్థతో కలిసి ఫైజర్‌ అభివృద్ధి చేస్తోంది. మనుషులపై దీనికి సంబంధించిన ప్రయోగాల సమాచారాన్ని వచ్చే నెలలో అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) కు అందజేసే అవకాశం ఉంది. ఆ సమయంలో అత్యవసర వినియోగ అనుమతి కోరనున్నట్లు ఫైజర్‌ వెల్లడించింది. అయితే ఈ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చి ఉండాలి.

2 నెలల సమాచారం ఉంటేనే

కొవిడ్‌-19 టీకాకు అత్యవసర వినియోగ అనుమతి ఇవ్వాలంటే దానికి సంబంధించిన కనీసం రెండు నెలల 'సేఫ్టీ డేటా'ను తనకు అందజేయాలని యూఎస్‌ఎఫ్‌డీఏ స్పష్టం చేస్తోంది. వచ్చేనెల మూడో వారం నాటికి 'సేఫ్టీ డేటా' తన చేతికి వస్తుందని ఫైజర్‌ అంచనా వేస్తోంది. అందుకే ఈ సంవత్సరాంతం నాటికి 10 కోట్ల డోసుల కొవిడ్‌-19 టీకా ఉత్పత్తి చేయాలని ఫైజర్‌- బయోన్‌టెక్‌ నిర్దేశించుకున్నాయి.

ఇదీ చదవండి:కరోనా కుటుంబం నుంచి మరో వైరస్- ఇదీ చైనా నుంచే!

ABOUT THE AUTHOR

...view details