తెలంగాణ

telangana

ETV Bharat / international

త్వరలో చిన్నారులకూ ఫైజర్ టీకా- ట్రయల్స్​లో సత్ఫలితాలు! - ఫైజర్ టీకా కిడ్స్

ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల వయసు పిల్లల్లో (Pfizer kids under 12) ఫైజర్ టీకా సురక్షితంగా పనిచేస్తోందని ఆ సంస్థ (Pfizer Covid vaccine) తెలిపింది. వీరిపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు సానుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు స్పష్టం చేసింది.

pfizer vaccine
ఫైజర్ టీకా

By

Published : Sep 20, 2021, 8:43 PM IST

ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల వ‌య‌సు వారికి (Pfizer kids under 12) త‌మ టీకా సుర‌క్షిత‌మని అమెరికా ఫార్మా దిగ్గజ సంస్థ ఫైజ‌ర్ వెల్లడించింది. ఇటీవల నిర్వహించిన క్లినిక‌ల్ ట్రయ‌ల్స్ ఫ‌లితాలు సానుకూలంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఫైజ‌ర్‌- బ‌యోఎన్‌టెక్ కొవిడ్ టీకా (Pfizer Covid vaccine) 5 నుంచి 11 ఏళ్ల మ‌ధ్య చిన్నారుల‌పై ప్రభావ‌వంతంగా పనిచేస్తోందని, యాంటీబాడీల‌ను పెంచుతున్నట్లు తెలిపింది.

ఫైజర్‌ టీకాతో డెల్టా వేరియంట్‌కు (Pfizer Delta Variant Vaccine) కూడా చెక్ పెట్టవ‌చ్చని ఫైజ‌ర్ ఛైర్మన్‌, సీఈవో ఆల్బర్ట్ బొరులా వెల్లడించారు. చిన్నారులకు అత్యవసర వినియోగం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అమెరికాలో 16 ఏళ్లు దాటిన వారికి ఇప్పటికే కొమిర్నాటీ (Comirnaty Vaccine Pfizer) పేరుతో టీకా అందిస్తోంది ఫైజ‌ర్ సంస్థ. 12 నుంచి 15 ఏళ్ల వారికి మాత్రం అత్యవసర వినియోగం కింద ఈ టీకా వాడుతున్నారు. 6 నెల‌ల నుంచి రెండేళ్లు, 2 నుంచి 5 ఏళ్ల లోపు చిన్నారుల‌కు కూడా టీకా ట్రయ‌ల్స్ నిర్వహిస్తున్నట్లు ఫైజ‌ర్ తెలిపింది.

ఇదీ చదవండి:'వచ్చే నెల చివర్లో చిన్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్​!'

ABOUT THE AUTHOR

...view details