దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్(Covid new variant) 'ఒమిక్రాన్'.. ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది. ఈ వేరియంట్(Omicron variant covid) వ్యాక్సిన్లకు లొంగదేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ టీకా తయారీ సంస్థలు ఫైజర్, బయోఎన్‌టెక్.. శనివారం కీలక ప్రకటన చేశాయి. ఒమిక్రాన్ వేరియంట్‌ను తమ వ్యాక్సిన్లు సమర్థంగా ఎదుర్కొంటాయా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదని చెప్పాయి. ఈ కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న టీకాను(Omicron variant vaccine) తాము 100 రోజుల్లోగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నాయి.
"వ్యాక్సిన్లను లొంగని వేరియంట్ ఉత్పన్నమైన సందర్భంలో.. నిబంధనలకు అనుగుణంగా ఆ వేరియంట్‌ను ఎదుర్కొనే టీకాను దాదాపు 100 రోజుల్లో ఫైజర్, బయోఎన్‌టెక్ అభివృద్ధి చేయగలవు."
-ఫైజర్, బయోఎన్‌టెక్ ప్రకటన
ఒమ్రికాన్ వేరియంట్‌కు సంబంధించి మరింత సమాచారం రెండు వారాల్లో లభిస్తుందని ఆశిస్తున్నట్లు ఫైజర్, బయోఎన్‌టెక్ తెలిపాయి. ఈ కొత్త వేరియంట్ మునుపటి వేరియంట్ల కంటే చాలా భిన్నమైనదని చెప్పాయి. కొత్త వేరియంట్లను ఎదుర్కొనే టీకాలను(Vaccines on new variants) అభివృద్ధి చేసే పనిని తాము కొన్ని నెలల కిందటే ప్రారంభించామని పేర్కొన్నాయి. ప్రస్తుతం తమ వద్ద ఉన్న వ్యాక్సిన్లు ఆరు వారాల పాటు సర్దబాటు కాగలవని.. మరో 100 రోజుల్లో కొత్త బ్యాచ్‌ను అందిస్తామని వెల్లడించాయి.