అమెరికాలో 12 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్న టీనేజర్లకు కూడా తమ టీకా అందించేందుకు అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని ఆ దేశ ఆహార ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ)ను ఫైజర్ సంస్థ, దాని భాగస్వామి బయోఎన్‌టెక్ సంస్థలు కోరాయి. వీలైనంత త్వరగా 12 నుంచి 15 ఏళ్ల చిన్నారులకు టీకా అందించే దిశగా.. అత్యవసర అనమతి కోసం ఎఫ్‌డీఏ సహా ఇతర దేశాల్లోని నియంత్రణ సంస్థలతోనూ తాము ప్రయత్నాలు జరుపుతున్నామని పేర్కొన్నాయి.
టీనేజర్లకు టీకా- ఎఫ్‌డీఏకు ఫైజర్ దరఖాస్తు - అమెరికాలో ఫైజర్ టీకా వినియోగం
అమెరికాలో 12 నుంచి 15 ఏళ్ల వయసున్న టీనేజర్ల కోసం తమ టీకా అందించేందుకు అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని అక్కడి ఆహార ఔషధ సంస్థను ఫైజర్ సంస్థ కోరింది. ఇటీవల ఈ వయస్సు వారిపై నిర్వహించిన పరీక్షల్లో తమ టీకా 100 శాతం సురక్షితమని తేలిందని పేర్కొంది.
అమెరికాలో గతేడాది డిసెంబర్ నుంచి 16 ఏళ్ల వయస్సు పైవారికి ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి అమెరికా ఆమోదం తెలిపింది. మరోవైపు.. 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు వారిపై జరిపిన ప్రయోగ పరీక్షల ఫలితాలను మార్చి 31న ప్రకటించగా.. తమ టీకా 100 శాతం సురక్షితమని తేలిందని ఫైజర్ సంస్థ తెలిపింది. టీకా పొందిన వారిలో పెద్దలకు వచ్చినట్లుగానే జ్వరం, చలి మొదలైనవి వస్తున్నాయని పేర్కొంది. టీకా ప్రభావంపై పూర్తి అధ్యయనం కోసం అభ్యర్థుల ఆరోగ్యాన్ని రెండేళ్ల పాటు గమనిస్తామని చెప్పింది.
ఇదీ చూడండి:6 నెలల వరకు ఫైజర్ వ్యాక్సిన్ ప్రభావం