అవినీతి కేసులో అరెస్ట్ చేస్తారనే భయంతో పెరూ మాజీ అధ్యక్షుడు అలాన్ గార్సియా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 17న జరిగిన ఘటనకు ముందు జరిగిన దృశ్యాలను హోంశాఖ విడుదల చేసింది.
లాటిన్ అమెరికాలో జరిగిన అతిపెద్ద అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గార్సియాను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. వారితో మాట్లాడిన ఆయన ఇప్పుడే వస్తానని భవనంపై అంతస్తులోకి వెళ్లారు. గార్సియా నడుముకు తుపాకీ ఉన్నట్లు గ్రహించిన పోలీసులు ఆయనను అనుసరిస్తూ పైకి వెళ్లారు. మాజీ అధ్యక్షుడు పడక గదిలోకి వెళ్లగా బయటే వేచి ఉన్నారు పోలీసులు. కాసేపటికే గార్సియా తుపాకీతో తలపై కాల్చుకుని మరణించారు.
"ఓడెబ్రేచ్ కేసులో భాగంగా గార్సియాను అదుపులోకి తీసుకనేందుకు అరెస్ట్ వారెంట్‌తో ఆయన ఇంటికి గత బుధవారం పోలీసులు వెళ్లారు. న్యాయవాదికి ఫోన్ చేసుకుంటానని కోరారు. ఆ తరువాత తన పడక గదిలోకి వెళ్లి తుపాకీతో కాల్చుకుని చనిపోయారు."
- పోలీసు అధికారులు.