పెరూ అధ్యక్షుడు మాన్యువల్ మెరినోకు వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనలతో ఆయన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ దేశ రాజకీయాల్లో రాజ్యాంగ సంక్షోభం నెలకొంది. ఇప్పటికే మెరినోకు వ్యతిరేకంగా పెద్దమొత్తంలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారు.
మాన్యువల్ మెరినో రాజీనామాకు ముందు ఆ దేశ ప్రజాప్రతినిధులు.. నిరసనల మధ్యనే లిమాలోని చట్టసభకు చేరుకున్నారు. ఆందోళనకారులను అదుపుచేయడానికి పోలీసులు టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు.