కోట్ల సంవత్సరాల క్రితం అంగారకుడిపై నీటి జాడను ధ్రువీకరించే(Mars Water Percentage) ఆనవాళ్ల చిత్రాలను నాసా(NASA Mars) విడుదల చేసింది. జెజిరో బిలంలో ఒకప్పుడు నది ప్రవహించినట్లు నాసాకి చెందిన పర్సెవెరెన్స్ రోవర్(Perseverance Rover) గుర్తించింది. ఆ ప్రాంతానికి సంబంధించిన చిత్రాలను రోవర్ చిత్రీకరించగా వాటిని నాసా విడుదల చేసింది. దీనితో ఒకప్పుడు అరుణ గ్రహంపై పుష్కలంగా నీరు ప్రవహించిందన్న నాసా శాస్త్రవేత్తల(NASA Scientists Names) అంచనాలకు తాజా చిత్రాలు బలాన్ని చేకూరుస్తున్నాయి.
అంగారకుడిపై ప్రవహించిన నది- పుష్కలంగా నీరు! - నాసా పంపిన అంగారకుడి ఫొటోలు
అంగారకుడిపై నీటి ఆనవాళ్ల(Water on Mars) గుర్తింపులో కీలక మైలురాయిని చేరుకున్నారు శాస్త్రవేత్తలు. నాసా రోవర్ పర్సెవెరెన్స్(NASA Perseverance Mars Rover) పంపిన చిత్రాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఒకప్పడు అరుణ గ్రహంపై నది ప్రవహించినట్లు భావిస్తున్నారు.
NASA
దాదాపు 3.7 బిలియన్ సంవత్సరాల క్రితం అంగారకుడిపై నీటి అణువులు ఏర్పడేందుకు కావాల్సిన వెచ్చటి, తేమ కలిగిన వాతావరణం ఉండేదని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇవీ చదవండి:
Last Updated : Oct 8, 2021, 2:29 PM IST