తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్యాట్​మ్యాన్​ వీరత్వానికి 80 వసంతాలు - బ్రూస్​ వేని

'బ్యాట్​ మ్యాన్​ డే'ను వేర్వేరు దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఘనంగా నిర్వహించారు. అభిమానులు సూపర్​ హీరో వేషధారణలో సందడి చేశారు.

మెక్సికోలో ఘనంగా బ్యాట్​మ్యాన్ వార్షికోత్సవం

By

Published : Sep 22, 2019, 2:04 PM IST

Updated : Oct 1, 2019, 1:59 PM IST

మెక్సికోలో ఘనంగా బ్యాట్​మ్యాన్ వార్షికోత్సవం

బ్యాట్​మ్యాన్​ 80వ వార్షికోత్సవాన్ని వేర్వేరు నగరాల్లో వైభవంగా నిర్వహించారు. మెక్సికో నగరంలోని టోర్రే రిఫార్మా భవనంపై అతిపెద్ద​ బ్యాట్​మ్యాన్ మాస్క్​​ చిహ్నాన్ని ప్రదర్శించారు.

అభిమానులు... బ్యాట్​మ్యాన్ వేషధారణలో వచ్చి కాసేపు ఆహ్లాదంగా గడిపారు.

"బ్యాట్​మాన్​ పాత్రను​ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తరాలు మారినా... ఆ పాత్ర ఎప్పటికీ ఓ పజిల్​లా ఉంటుంది."
-జిమేనా మార్టిన్, బ్యాట్​మ్యాన్​ అభిమాని

మెక్సికోతోపాటు టోక్యో, బెర్లిన్, రోమ్, పారిస్, లండన్, మాంట్రియల్, సావో పాలో, జోహన్నెస్‌బర్గ్‌లో 'బ్యాట్​ మ్యాన్​ డే'ను ఘనంగా నిర్వహించారు.
బ్యాట్​మ్యాన్​.... ఓ ఫిక్షనల్ సూపర్ హీరో పాత్ర. ముసుగు ధరించి నేరస్థులపై పోరాడే బ్రూస్​ వేన్ కథతో 1939లో తొలి కామిక్ పుస్తకం వచ్చింది. అప్పటినుంచి ఆ పాత్ర ఎంతగానో ఆదరణ పొందుతోంది.

ఇదీ చూడండి : భారత్​ గురించే 30 నిమిషాల పాటు ట్రంప్​ ప్రసంగం!

Last Updated : Oct 1, 2019, 1:59 PM IST

ABOUT THE AUTHOR

...view details