తెలంగాణ

telangana

ETV Bharat / international

Kabul attack: 'కాబుల్​ పేలుళ్లు రెండుచోట్ల కాదు.. ఒక్కచోటే' - అమెరికా భద్రతా విభాగం పెంటగాన్

కాబుల్​ విమానాశ్రయంలో రెండుచోట్ల బాంబు దాడులు(kabul airport attack) జరగలేదని అమెరికా భద్రతా విభాగం పెంటగాన్(Pentagon) స్పష్టం చేసింది. అబ్బేగేట్ వద్ద మాత్రమే పేలుడు సంభవించిందని పెంటగాన్ డిప్యూటీ డైరెక్టర్ మేజర్ జనరల్ హాంక్ టేలర్ తెలిపారు.

Kabul attack
కాబుల్​ పేలుళ్లు

By

Published : Aug 28, 2021, 6:59 AM IST

కాబుల్​ విమానాశ్రయం వద్ద జరిగిన పేలుళ్లపై(Kabul airport blast) అమెరికా భద్రతా విభాగం పెంటగాన్ కీలక ఆధారాలు వెల్లడించింది. పేలుళ్లు రెండు చోట్ల జరగలేదని.. అబ్బేగేట్ వద్ద మాత్రమే పేలుడు జరిగిందని స్పష్టం చేసింది. బారొన్ హోటల్ వద్ద పేలుడు జరగలేదని పెంటగాన్ డిప్యూటీ డైరెక్టర్ మేజర్ జనరల్ హాంక్ టేలర్ తెలిపారు. అబ్బేగేట్ వద్ద ఆత్మాహుతి దాడి జరిగిన తర్వాత.. గేట్ ఉత్తరాన కొందమంది కాల్పులకు పాల్పడ్డారని వివరించారు. కాల్పులు జరిపినవారి వివరాలు తెలియాల్సిఉందన్నారు.

ఆత్మాహుతి దాడి(Suicide attack) తామే చేశామని ఉగ్రవాద సంస్థ ఐసీస్​-కే​ ప్రకటించింది. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉగ్రవాది ఫొటోను కూడా విడుదల చేసింది. ఇప్పటికే ఈ దాడిలో 169 మంది మృతిచెందారు. సంఖ్య ఇంకా పెరగే అవకాశం ఉంది. ఈ పేలుళ్లలో 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

మృతుల్లో ముగ్గురు బ్రిటన్ వాసులు

కాబుల్ విమానాశ్రయంలో జరిగిన పేలుళ్లలో మృతిచెందిన వారిలో ముగ్గురు బ్రిటన్ వాసులు ఉన్నట్లు ఆ దేశ విదేశాంగ కార్యదర్శి డోమినిక్ రాబ్ తెలిపారు. మృతుల్లో ఓ చిన్నారి సైతం ఉందన్నారు. మరో ఇద్దరు బ్రిటన్ వాసులు గాయపడ్డారని వివరించారు. ఈ ఘటనపై తాము విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:కాబుల్​ పేలుళ్లకు తాలిబన్ల సాయం! ఆ రెండు చెక్​పోస్టులు దాటించి...

ABOUT THE AUTHOR

...view details