తెలంగాణ

telangana

ETV Bharat / international

మెక్సికో గోడకు నిధులు మంజూరు చేసిన పెంటగాన్ - border wall

మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ నిధులు మంజూరు చేసింది. గోడ నిర్మాణానికి బిలియన్ డాలర్లు మంజూరు చేసే దస్త్రంపై పెంటగాన్ తాత్కాలిక చీఫ్​ పాట్రిక్ షనహన్ సంతకం చేశారు.

మెక్సికో గోడకు నిధులు మంజూరు చేసిన పెంటగాన్

By

Published : Mar 26, 2019, 5:30 PM IST

మెక్సికో గోడకు నిధులు మంజూరు చేసిన పెంటగాన్
మెక్సికో - అమెరికా సరిహద్దు గోడ నిర్మాణం దిశగా ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుబడుతున్న ఈ గోడ నిర్మాణానికి బిలియన్ డాలర్ల నిధుల్ని అందించే దస్త్రంపై అమెరికా రక్షణ సంస్థ తాత్కాలిక ఛైర్మన్ పాట్రిక్ షనహన్ సంతకం చేశారు. 92 కిలోమీటర్ల మేర, 18 అడుగుల ఎత్తైన కంచె, రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు, లైటింగ్ తదితర ఏర్పాట్ల కోసం ఈ నిధుల్ని కోరింది అమెరికా అంతర్గత భద్రతా విభాగం.

"అంతర్గత భద్రత, సరిహద్దులో పహారా విషయమై ఆర్మీ ఇంజినీర్ల ప్రధానాధికారి బిలియన్ డాలర్లతో​ చేపట్టగలిగే ప్రణాళికలు తయారు చేయాలి. వాటిని అమలుపరచాలి"-పెంటగాన్ ప్రకటన

తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు పెంటగాన్ ఛైర్మన్ పాట్రిక్ షనహన్. రక్షణ బడ్జెట్ ముసాయిదా​ను అమెరికా కాంగ్రెస్​లో ప్రవేశపెట్టడానికి కొన్ని గంటల ముందు పాట్రిక్ దీనిపై ప్రకటన చేశారు.

"రహదారుల నిర్మాణానికి, కంచె ఏర్పాటుకు, లైటింగ్ ఏర్పాటు చేసేందుకు ఈ నిధుల్ని మంజూరు చేశాం. అంతర్జాతీయ సరిహద్దు వెంట మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఈ చర్యలను తీసుకున్నాం" -పాట్రిక్ షనహన్, పెంటగాన్ చీఫ్

మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి కాంగ్రెస్ ఆమోదం లభించనందువల్ల జాతీయ అత్యవసర స్థితిని విధించారు ట్రంప్. గోడ నిర్మాణానికి అవసరమైన 8 బిలియన్ డాలర్లు చట్టసభ సభ్యుల ఆమోదం లేకుండా మంజూరయ్యేందుకు ఈ ఎత్తుగడకు తెరతీశారు. ట్రంప్ నిర్ణయానికి ప్రతిపక్ష డెమొక్రాట్లు సహా స్వపక్షమైన రిపబ్లికన్ల ఆమోదమూ లభించలేదు.

ABOUT THE AUTHOR

...view details