కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చాలా దేశాల్లో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. ఈ సమయంలో అన్ని రకాల వేడుకలు, పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇలాంటి సమయంలో వినూత్న కార్యక్రమం చేపడుతోంది అమెరికా పెన్సిల్వేనియా అగ్నిమాపక శాఖ. అక్కడి చిన్నారుల పుట్టినరోజు వేడుకలు జరుపుతోంది. ఈ కష్ట సమయంలో ఎన్నో కుటుంబాల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
వేడుకలు చేస్తున్నారిలా..
చిన్నారులవి ఎవరివైనా పుట్టినరోజులు ఉంటే... పెన్సిల్వేనియా అగ్నిమాపక శాఖకు ఫేస్బుక్ ద్వారా తెలియజేయాలి. సిబ్బంది ఆ బాలలు ఉండే వీధుల్లో ఫైరింజిన్ సైరన్లు మోగిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారు.