తెలంగాణ

telangana

ETV Bharat / international

బహిరంగంగా కరోనా టీకా తీసుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు - కరోనా వ్యాక్సిన్

అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్​ బహిరంగంగా కరోనా వ్యాక్సిన్​ తీసుకున్నారు. ఈ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేసింది అమెరికా మీడియా.

Pence, wife Karen, get COVID-19 vaccine injections
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు

By

Published : Dec 18, 2020, 7:55 PM IST

అమెరికా ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్ శుక్రవారం బహిరంగంగా కరోనా టీకా వేయించుకున్నారు. ఉపాధ్యక్ష అధికార భవనంలో ఆయనకు వైద్యులు వ్యాక్సిన్​ ఇచ్చారు. దీంతో వ్యాక్సిన్​ అందుకున్న ప్రపంచ నేతల్లో మొదటివాడిగా పెన్స్ నిలిచారు. పెన్స్​ టీకా తీసుకుంటున్న దృశ్యాలను అమెరికా మీడియా ప్రత్యక్ష ప్రసారం చేసింది.

పెన్స్​తోపాటు ఆయన సతీమణి కారెన్, సర్జియన్ జనరల్​ జెరోమ్​ ఆదమ్స్ సైతం టీకాను వేయించుకున్నారు. తాను కూడా వచ్చేవారం కరోనా వ్యాక్సిన్​ను తీసుకోనున్నట్లు స్పీకర్​ నాన్సీ పెలోసి తెలిపారు.

ఇదీ చదవండి :శీతాకాలంలో కరోనా ఉగ్రరూపం!

ABOUT THE AUTHOR

...view details