అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. డెమొక్రటిక్ పార్టీ నుంచి ఉపాధ్యక్ష బరిలో ఉన్న కమలా హారిస్, ప్రస్తుత ఉపాధ్యక్షుడు, రిపబ్లిన్ పార్టీ నుంచి ఉపాధ్యక్ష రేసులో ఉన్న మైక్ పెన్స్ బుధవారం ముఖాముఖీ తలపడనున్నారు. యూటా రాష్ట్రంలోని సాల్ట్ లేక్ సిటీలో ఈ కార్యక్రమం జరగనుంది. యూఎస్ఏ టుడే పత్రికకు చెందిన సుసన్ పేజ్ సంధానకర్తగా వ్యవహరించనున్నారు. అమెరికా చరిత్రలో ఓ ప్రత్యక్ష చర్చా కార్యక్రమంలో ఓ భారత సంతతి వ్యక్తి పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం. కరోనా సంక్షోభం ముదురుతుండటం, అధ్యక్షుడు ట్రంప్ వైరస్ నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం అందరి చూపు వీరిపైనే ఉంది.
హారిస్ ఆధిపత్యంపై అంచనాలు..
వీరి చర్చ అధ్యక్ష అభ్యర్థులు ఆధిక్యం సాధించేందుకు దోహదం చేయనుంది. మరోవైపు ట్రంప్ కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన సొంత విధానాలతో పాటు ట్రంప్ లక్ష్యాలను కూడా పెన్స్ వివరించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:-ట్రంప్ X బైడెన్: వాడీవేడిగా తొలి డిబేట్