తెలంగాణ

telangana

ETV Bharat / international

అధ్యక్షుడి ప్రసంగ ప్రతులను చింపేసిన స్పీకర్​ - ట్రంప్ ప్రసంగం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రసంగ ప్రతులను చింపేశారు స్పీకర్​ నాన్సీ పెలోసి. అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి ట్రంప్​ ప్రసంగించిన అనంతరం.. ఈ చర్యకు పూనుకున్నారు పెలోసి.

అధ్యక్షుడి ప్రసంగ ప్రతులను చింపేసిన స్పీకర్​
అధ్యక్షుడి ప్రసంగ ప్రతులను చింపేసిన స్పీకర్​

By

Published : Feb 5, 2020, 11:25 AM IST

Updated : Feb 29, 2020, 6:20 AM IST

అధ్యక్షుడి ప్రసంగ ప్రతులను చింపేసిన స్పీకర్​

ఉభయ సభలను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడి ప్రసంగ సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ ప్రసంగం పూర్తి కాగానే.. అందుకు సంబంధించిన పత్రాలను చింపేశారు ప్రతినిధుల సభ స్పీకర్​ నాన్సీ పెలోసి.

అధికారంలోకి వచ్చాక మూడోసారి ఉభయసభలను ఉద్దేశించి ప్రసగించారు ట్రంప్. ఆయన ప్రసంగం పూర్తయిన వెంటనే ట్రంప్​ వెనకాలే కూర్చున్న పెలోసి... ప్రసంగ కాపీలను చింపేశారు.

'మర్యాదపూర్వకమైన పనే..'

ఈ చర్యపై వివరణ కోరగా.. ప్రత్యామ్నాయాలను పరిశీలించినప్పుడు ఇదే అత్యంత మర్యాదపూర్వక చర్యగా తనకు తోచిందని పెలోసి పేర్కొన్నారు.

ప్రారంభంలో ట్రంప్​ ప్రసంగం కాపీలను సభ పెద్దలకు అందించారు. ఆ సమయంలో పెలోసి కరచాలనం ఇచ్చేందుకు ప్రయత్నించగా ట్రంప్​ నిరాకరించారు.

Last Updated : Feb 29, 2020, 6:20 AM IST

ABOUT THE AUTHOR

...view details