తెలంగాణ

telangana

ETV Bharat / international

చర్చిలో కాల్పులు- పాస్టర్​ మృతి - అమెరికాలో కాల్పులు

అమెరికాలోని ఈస్ట్​ టెక్సాస్​లో ఓ చర్చి పాస్టర్​ హత్యకు గురైయ్యారు. ముందుగానే చర్చిలో దాక్కున్న నిందితుడు.. తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటనలో మరో వ్యక్తికి గాయాలయ్యాయి.

Pastor killed, suspect in custody in church shooting at East Texas
చర్చిలో కాల్పులు- పాస్టర్​ మృతి

By

Published : Jan 4, 2021, 7:55 AM IST

అమెరికా తూర్పు టెక్సాస్​లో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో చర్చి పాస్టర్​ మరణించారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. స్థానికంగా ఉండే ఏరియా అసుపత్రిలో చేతికి గాయం అయిన వ్యక్తి చికిత్సపొందినట్లు పేర్కొన్న పోలీసులు.. ఆ వ్యక్తి నిందితుడే అయ్యే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.

దీనిపై స్థానిక గవర్నర్ గ్రెగ్ అబోట్ స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టం అని పేర్కొన్నారు. పట్టుబడిని నిందితుడిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నాట్లు తెలిపారు.

ఇదీ చూడండి: 'నాకు ఆ ఓట్లు కావాలి'- జార్జియా అధికారితో ట్రంప్​

ABOUT THE AUTHOR

...view details