గడిచిన పదేళ్ల కాలం(2010-2019) భూమి మీద అత్యంత వేడిగా ఉన్న దశాబ్దిగా నమోదైంది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగం ప్రకటించింది. ఈ ప్రకటనను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా), అమెరికా సముద్ర-వాతావరణ విభాగం కూడా ధ్రువీకరించాయి.
2020తో పాటు ఆ తర్వాత కుడా అసాధారణమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐరాస తెలిపింది. 140 ఏళ్లలో 2019 రెండో అత్యంత వేడిగా ఉన్న సంవత్సరమని నాసా, ఎన్ఓఏఏ ప్రకటించాయి.