మీ సెల్‌ఫోన్‌ని ఓ చిలుక ఎత్తుకెళ్తే? ఆ సమయంలో మీ సెల్‌ఫోన్ కెమెరా ఆన్‌లోనే ఉండటమే కాకుండా.. అది రికార్డవుతుంటే? చుట్టూ పరిసరాలు డ్రోన్లో చిత్రీకరించినట్లుగా కనిపిస్తాయి కదూ? ఓ వ్యక్తికి సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది.
సెల్‌తో తుర్రుమన్న చిలుక..
ఓ వ్యక్తి ఫొటోలు తీసుకుంటుండగా అతని మొబైల్‌ను ఓ చిలుక ఎత్తుకెళ్లింది. దీంతో కంగారుపడిన ఆ అతను తన ఫోన్ కోసం ఆ చిలుక వెంట పరుగెత్తాడు. అయితే అది అతనికి దొరక్కుండా చాలా ఎత్తుకు ఎగిరి పారిపోయింది. ఆ ఫోన్ కెమెరా ఆన్‌లో ఉండటంతో పైకి ఎగిరిన చిలుక సిటీ మొత్తాన్ని వీడియో తీసేసింది.!
భలే చిలుక..
ఆ చిలుక వేగంగా ఎగురుతుండగా వీధులు, ఇళ్లు, భవనాలు, పరిసర దృశ్యాలు రికార్డయ్యాయి. కొద్దిసేపు ఎగిరిన చిలుక ఓ బాల్కనీ వద్ద ఆగింది. అయితే ప్రజలు దానిని వెంబడించడం వల్ల మళ్లీ ఎగరడం మొదలుపట్టింది. చిలుక తన కంటి చూపుతోనే ఈ వీడియో తీసిందా అన్నట్లున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి ఆ దృశ్యాలు. 9.73 లక్షల వ్యూస్, 7వేల రీట్వీట్‌లతో దూసుకెళ్తోంది ఆ వీడియో. @fred035schultz అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియోకు 'పారట్ ఫోన్ ట్రిప్' అనే క్యాప్షన్‌ను ఇచ్చారు.
నమ్మలేమంటూ కామెంట్లు..