అమెరికాలో తమ కార్లు కొన్న కొంత మంది వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ కియా హెచ్చరించింది. సాంకేతికపరమైన లోపాల కారణంగా ఇంజన్లో మంటలు వస్తున్నాయని తెలిపిన సంస్థ.. 3 లక్షల 80 వేల కార్లను వెనక్కి పిలిపించింది. ఈ నేపథ్యంలో.. కార్లను ఇంట్లో పార్కు చేయవద్దని.. బయట పెట్టాలని సూచించింది.
సమస్యను పరిష్కరించడానికి స్పోర్టేజ్ ఎస్యూవీ వాహనాలను రికాల్ చేస్తున్నట్లు ప్రకటించింది కియా. ఎలక్ట్రానిక్ బ్రేక్ కంట్రోల్ యూనిట్‌లో షార్ట్ సర్క్యూట్‌తో అధిక విద్యుత్తు విడుదలై అగ్నిప్రమాదానికి దారి తీస్తోందని తెలిపింది. ఆ కార్లు పూర్తి స్థాయిలో సిద్ధం అయ్యే వరకు వాటికి దూరంగా ఉండాలని పేర్కొంది. అయితే కియా స్మార్ట్ క్రూయిస్ సిస్టమ్‌ను కలిగి ఉన్న వాహనాలకు ఎటువంటి సాంకేతిక ఇబ్బందుల ఉండవని స్పష్టం చేసింది.