తెలంగాణ

telangana

ETV Bharat / international

మనసును తాకిన ప్రపోజల్.. ప్రియుడిపై ముద్దుల వర్షం​ - ఎక్సోస్కెలిటన్ సూట్​లో ప్రపోజ్

వెడ్డింగ్​ ప్రపోజల్ ఓ అరుదైన సందర్భం. ప్రతి ఒక్కరూ దీనిని ఓ మధుర జ్ఞాపకంగా మలుచుకుంటారు. ఈ ప్రపోజల్​ను ఎన్నో రకాలుగా ప్రయత్నించి ప్రేయసి ఆకట్టుకోవాలని అనుకుంటారు. కానీ ఇందులో చెప్పిన ప్రపోజల్​ అయితే అన్నింటికంటే చాలా ప్రత్యేకం, విభిన్నం. ఇంతకీ ఆ స్టోరీ ఏంటి?

exoskeleton suit
ఎక్సోస్కెలిటన్​ షూట్

By

Published : Jul 28, 2021, 2:08 PM IST

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ప్రేయసిపై తనకున్న ఇష్టాన్ని ప్రపోజ్​ చేసి చెప్పాలని అనుకున్నాడు. అందరు ప్రేమికులు చేసేది ఇదే కదా! ఇందులో వింత ఏముంది అని అనుకుంటున్నారా? అవును ఇది నిజంగా వింతే!

సంకల్పం ఉంటే ఏ పనైనా చేయొచ్చని అంటారు. దానికి ప్రేమ తోడైతే దానికి తిరుగుండదు. పైన చెప్పిన స్టోరీలో ఇలానే జరిగింది. కనీసం కదల్లేని స్థితిలో ఉన్న ఓ వ్యక్తి, ఓ పరికరం సహాయంతో మోకాలిపై వంగి ఆమెకు తన ప్రేమను వ్యక్తపరిచాడు. తెగ సంతోషపడిన ప్రేయసి.. అతడిపై ముద్దుల వర్షం కురిపించింది.

అనుకోని ప్రమాదం..

అమెరికా వర్జీనియాలో నివసిస్తున్న జోస్​ స్మిత్.. 2014లో స్నేహితులతో కలిసి బీచ్​కు వెళ్లాడు. అక్కడ అనుకోని ప్రమాదం అతన్ని కుర్చీకే పరిమితం చేసింది. డైవింగ్​ చేస్తుండగా.. ఇసుకతిన్నెలకు తగులుకుని స్మిత్​కు బలమైన గాయాలు అయ్యాయి. దీని కారణంగా శరీరంలో ఛాతీ కింద భాగం పారలైజ్ అయింది. రోజూవారి దినచర్యలేవి చేయలేని దుస్థితి అతడికి ఏర్పడింది.

కదిలించిన ప్రేమ..

స్మిత్​​, గ్రేస్​ అనే యువతిని గత ఏడాది ఫిబ్రవరిలో కలిశాడు. వారి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు ఒక్కటవ్వాలనుకున్నారు. ఈ అక్టోబర్​లో వివాహానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అయితే వెడ్డింగ్​ ప్రపోజల్ అనుభూతిని తన ప్రేయసికి కలిగించాలని స్మిత్ భావించాడు​. అందుకు తన అచేతనత్వం అడ్డొచ్చినా.. ఆమెపై ఉన్న ప్రేమ తనను కదిలించింది. హెక్సోస్కెలిటన్ రూపంలో దారి చూపించింది. ఆ వస్తువును ఉపయోగించి సాధారణ వ్యక్తులలాగే మోకాలిపై వంగి, ప్రపోజ్​ చేసి తన ప్రేయసిని ఆశ్చర్యపరిచాడు. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన ఈ వీడియో నెటిజన్ల మనసు కదిలిస్తోంది.

"సంప్రదాయంగా ప్రపోజ్​ చేయాలనే ఆలోచన వచ్చింది. కానీ అది సాధ్యం అవుతుందో లేదో నాకు తెలియదు. ఇంతకుముందు నాలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్లు ఎవరూ ఇలా చేయడం చూడలేదు. వైద్యులను సంప్రదించి విషయం వివరించాను. వారు నాకు సహకరించారు. హెక్సోస్కెలిటన్​ సహాయంతో నేను అనుకున్న దానిని సాధ్యం చేశారు" అనిజోష్ స్మిత్​ చెప్పాడు.

ఇదీ చదవండి:డెస్టినేషన్ వెడ్డింగ్​ నుంచి కాక్​టైల్ పార్టీ వరకు...

ABOUT THE AUTHOR

...view details