తెలంగాణ

telangana

ETV Bharat / international

టెక్నాలజీకే సవాల్ విసురుతున్న 'మాస్కు' - mask problem

కరోనా భయంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మాస్కులను తప్పనిసరిగా ధరిస్తున్నారు. కొన్ని దేశాలు మాస్కు పెట్టుకోకపోవాడన్ని నేరంగా కూడా పరిగణిస్తున్నాయి. ఇయితే ఇప్పడు ఆ మాస్కే కొత్త సమస్యను తెచ్చిపెడుతోందని చెబుతోంది తాజా అధ్యయనం. మాస్కులు ఫేషియల్​ రికగ్నీషన్​ వ్యవస్థను బోల్తా కొట్టిస్తున్నాయని పేర్కొంది. నిజంగా మాస్కు.. టెక్నాలజీకే సవాల్ విసురుతోందా? మాస్కులతో నిఘా వ్యవస్థకు వచ్చిన అడ్డంకి ఏంటి?

face recognition tech
టెక్నాలజీకే సవాల్ విసురుతున్న మాస్కులు

By

Published : Aug 9, 2020, 12:11 PM IST

కరోనాతో ప్రపంచమంతా మాస్కు మాటున బతుకుతోంది. మాస్కులు​ ధరించడం మొదలుపెట్టాక.. తెలిసిన వాళ్లను గుర్తుపట్టడం కూడా కష్టంగా మారుతోంది. అయితే మనుషులు మాత్రమే కాకుండా కంప్యూటర్లు సైతం.. మాస్కులు ధరించిన వాళ్ల ముఖాలను గుర్తించడంలో విఫలమవుతున్నాయని అంటోంది అమెరికాకు చెందిన నేషనల్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ(ఎన్ఐఎస్టీ) ఏజెస్సీ అధ్యయనం.

భారత్​లాంటి జనసాంద్రత ఉన్న దేశాల్లో త్వరితగతిన నేరస్థులను పట్టుకునేందుకు 'ఫేషియల్​ రికగ్నీషన్ సిస్టమ్'​ చేసే సాయం అంతా ఇంతా కాదు. గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఎన్నో క్లిష్టమైన కేసులకు ఈ వ్యవస్థ పరిష్కారం చూపింది. కానీ ఇప్పుడు ఆ టెక్నాలజీకే సవాల్​ విసురుతున్నాయి మాస్కులు.

మాస్కులు వేసి.. తీసేసి..

ఫేషియల్​ రికగ్నీషన్​ ప్రక్రియలో మాస్కు కారణంగా డిజిటల్​ వ్యవస్థ పూర్తిస్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోతోందని ఎన్ఐఎస్టీ నివేదిక చెబుతోంది.

మాస్కులు ధరించిన వారి ముఖాలను గుర్తించడంలో 'ఫేషియల్​ రికగ్నిషన్ సిస్టమ్' ఎలా పని చేస్తుందని ఎన్ఐఎస్టీ అధ్యయనం చేసింది. ఇందుకోసం ఓ సాఫ్ట్​వేర్​ను పరీక్షించారు పరిశోధకులు. కొన్ని ఫొటోలకు డిజిటల్​ మాస్కులను వేసి పరీక్షించారు. వీటితో మిగిలిన ఫొటోలను పోల్చి చూశారు.

ఇలా 10లక్షల మందికి సంబంధించిన 6.2 మిలియన్ ఫొటోలను స్కాన్ చేశారు. ఇందుకోసం 89 అల్​గారిథమ్​లను ఉపయోగించారు. సాధారణంగా.. ఆ సాఫ్ట్​వేర్ విఫలమయ్యే అవకాశాలు 0.3శాతం మాత్రమే. కానీ డిజిటల్​ మాస్కు వేసిన ఫొటోలను గుర్తుపట్టడంలో 5శాతం వైఫల్యం కనపడినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ సందర్భంగా వినియోగించిన అల్​గారిథమ్​లు 20శాతం నుంచి 50శాతం వరకు విఫలమైనట్లు ప్రకటించారు. అయితే ముఖాన్ని గుర్తించడంలో జాతి, లింగ భేదం, వయస్సు కూడా ప్రభావితం చూపినట్లు పేర్కొంది. వీటితో పాటు మాస్కులను ధరించే విధానాల వల్ల కూడా సాఫ్ట్​వేర్​లు బోల్తాపడుతున్నాయి.

మాస్కులతో తిప్పలు...

కరోనా కారణంగా తొలుత మాస్కులను తప్పనిసరి చేసిన హాంకాంగ్​.. తర్వాత వాటిని ధరించడాన్ని నిషేధించింది. చైనా తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనల్లో నిరసనకారులు మాస్కులు ధరించి పాల్గొనడం వల్ల వారిని గుర్తించడం కష్టమైంది. అందుకే ఆ దేశంలో మాస్కుల వాడకాన్ని నిషేధించింది.

అమెరికాలో జార్జి ఫ్లాయిడ్​ మృతికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లోనూ నిరసనకారులు మాస్కులు ధరించారు. దీంతో వారిని పట్టుకోవడం అక్కడి పోలీసులకు తలకుమించిన భారమైంది.

అలాగే లండన్​లో కరోనాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన హైటెక్​ నిఘాను వ్యతిరేస్తూ ప్రైవసీ యాక్టివిస్ట్​లు జామెట్రిన్​ ఆకారంలోని మాస్కులు ధరించి ఆందోళనల్లో పాల్గొన్నారు. ఫలితంగా వారిని గుర్తించడంలో లండన్​ పోలీసులు విఫలమయ్యారు.

తలలు పట్టుకుంటున్న దేశాలు..

మాస్కులు.. నిఘా వ్యవస్థకు విఘాతంగా మారిన నేపథ్యంలో దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు పరిష్కార మార్గాలను వెతికేపనిలో పడ్డాయి. మాస్కులు ధరించే ప్రక్రియలో మార్పులు చేయాలా? లేక ముఖాలను గుర్తించే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేయాలా? అనే సందిగ్ధంలో ప్రపంచ దేశాలు సమాలోచనలు చేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details