న్యూయార్క్ నగరంలో "ఇంటర్నేషనల్ ఆటో షో-2019" కార్ల ప్రేమికుల కళ్లు చెదిరేలా అట్టహాసంగా జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ సంస్థలకు చెందిన మోడళ్లు ఈ ప్రదర్శనలో సందడి చేస్తున్నాయి.
దాదాపు వెయ్యికిపైగా యుటిలిటీ కార్ల మోడళ్లు ప్రదర్శనలో ఉన్నాయి. అందులో ఎక్కువ ఎస్యూవీలేనని నిర్వాహకులు తెలిపారు.
మెర్సిడెస్ బెంజ్‌కు చెందిన పూర్తిగా విద్యుచ్ఛక్తితో పని చేసే 2020 ఈక్యూసీ ఎస్యూవీ ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో ధ్వనితో నియంత్రించే ప్రత్యేక ఫీచర్ సందర్శకులను ఆకర్షిస్తోంది.