ఐక్యరాజ్య సమితి నిబంధనలను తన స్వప్రయోజనాలకు వినియోగించుకుని తద్వారా భారత్‌ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించిన పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఐరాస భద్రతా మండలి ఈ కుతంత్రాన్ని విజయవంతంగా తిప్పికొట్టింది.
ఉగ్రసంస్థ అల్ ఖైదాతో నలుగురు భారతీయులకు సంబంధాలు ఉన్నాయంటూ నిరాధార ఆరోపణలతో ఓ జాబితాను ఐరాస భద్రతామండలికి చెందిన '1267 అల్‌ఖైదా శాంక్షన్ కమిటీ'కి పాకిస్థాన్ సమర్పించింది. అంగర అప్పాజీ, గోబింద పట్నాయక్, అజోయ్ మిస్త్రీ, వేణుమాధవ్ దొంగర పేర్లు ఆ జాబితాలో ఉన్నాయి. అయితే ఎటువంటి ఆధారాలు చూపని ఆ జాబితాలను అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం దేశాలు తిరస్కరించాయి.