ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేస్తున్నాడనే కేసులో పాకిస్థాన్ కోర్టు అయిదేళ్ల జైలు శిక్ష విధించిన లష్కరే తోయిబా ఉగ్రవాది జకీ-ఉర్ రెహమాన్‌ను 2008 ముంబయి ఉగ్రదాడికి బాధ్యుడిగా పాకిస్థాన్ ప్రకటించాలని అమెరికా డిమాండ్ చేసింది. లఖ్వీకి జైలు శిక్ష ఖరారు చేయటం పట్ల సంతృప్తి వ్యక్తం చేసినా.. ముంబయి సహా ఇతర ఉగ్రదాడులకు జవాబుదారీ చేయాలని సూచించింది. లఖ్వీ నేరాలు ఉగ్రవాదులకు ఆర్థిక సాయం సహా అంతకన్నా ఎక్కువే ఉన్నాయని పేర్కొంది.
'ముంబయి ఉగ్రదాడికి లఖ్వీని బాధ్యుడిగా ప్రకటించాలి'
2008 ముంబయి ఉగ్రదాడికి బాధ్యుడిగా లష్కరే తోయిబా ఉగ్రవాది జకీ-ఉర్ రెహమాన్‌ను పాకిస్థాన్ ప్రకటించాలని డిమాండ్ చేసింది అమెరికా. లఖ్వీకి జైలు శిక్ష విధించటం పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది.
లష్కరే తోయిబా ఉగ్రవాది జకీ-ఉర్ రెహమాన్
ముంబయి ఉగ్రదాడులకు సంబంధించిన కేసులో జైలు శిక్ష అనుభవించి 2015లో బెయిల్ పొందిన లఖ్వీని ఈ నెల 2న పాకిస్థాన్ ఉగ్రవాద నిరోధక బృందం అరెస్టు చేసింది. వారంలోపే విచారణ పూర్తి చేసిన ఆ పాక్ ఉగ్రవాద నిరోధక న్యాయస్ధానం మూడు వేర్వేరు కేసుల్లో ఈ నెల 8న అయిదేళ్ల చొప్పున శిక్ష విధించింది.
ఇదీ చూడండి:ముంబయి దాడుల సూత్రధారికి 15 ఏళ్ల జైలు