భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తమ మధ్య ఉన్న స్నేహాన్ని ప్రపంచదేశాలకు చాటిచెబుతున్న తరుణంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కుట్రపూరిత వైఖరిని మరోసారి బహిర్గతం చేశారు. తాజాగా కశ్మీర్లో ఆంక్షలు కొనసాగితే యుద్ధం తప్పదని భారత్‌ను హెచ్చరించారు.
"50 రోజుల నుంచి 9 లక్షల సైనికుల వల్ల కశ్మీర్ ప్రజలు అణచివేతకు గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో బహిరంగంగా జైలు వంటి పరిస్థితిలో 80 లక్షల మంది ఉండటం ఎన్నడూ జరగలేదు. కర్ఫ్యూను ఎత్తేసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయన్నది ఆందోళనకర అంశం. ఏదో ఒక సమయంలో రెండు అణ్వాయుధ దేశాలు ఎదురుపడక తప్పదు. యుద్ధం వచ్చే ప్రమాదముంది."
--- ఇమ్రాన్‌ఖాన్, పాకిస్థాన్ ప్రధాని