తెలంగాణ

telangana

ETV Bharat / international

UNGA 2021: మళ్లీ పాక్ వక్ర బుద్ధి- గట్టిగా బదులిచ్చిన భారత్ - అమెరికా

అంతర్జాతీయ వేదికలో భారత్​పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది పాక్ (India Pak news). భారతదేశ అంతర్గత వ్యవహారమైన జమ్ముకశ్మీర్​ గురించి ఐరాస ప్రసంగంలో (UNGA 2021) ప్రస్తావించారు పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్ (Pakistan news). అయితే కశ్మీర్​ సహా అక్కడి పాక్​ ఆక్రమిత ప్రాంతాలు దేశం​లో అంతర్భాగమని గట్టిగా బదులిచ్చింది భారత్. ఉగ్రవాదులను పెంచే ఆ దేశ చర్యలతో ప్రపంచం మొత్తం నష్టపోయిందని విమర్శించింది.

unga 2021
ఐరాస

By

Published : Sep 25, 2021, 11:33 AM IST

Updated : Sep 25, 2021, 11:58 AM IST

అంతర్జాతీయ వేదికలపై (UNGA 2021) భారత్‌పై విషంకక్కే పాకిస్థాన్ (Pakistan news) తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శించింది. ఐక్యరాజ్యసమతి 76వ సర్వసభ్యసమావేశంలో (76th UN General Assembly).. వీడియో విడుదల చేసిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan UN Speech).. భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు (Article 370 Abrogation) నిర్ణయం, వేర్పాటు వాద నేత సయ్యద్ అలీ షా గిలానీ మృతి అంశం ప్రస్తావించారు.

"మానవ హక్కుల ఉల్లంఘనల పట్ల ప్రపంచ వైఖరి అసమానంగా ఉంది. భారత్​లో వివక్షతో కూడిన పౌరసత్వ చట్టాల వల్ల 20 కోట్ల మంది ముస్లింలు భయాందోళనలో ఉన్నారు. కశ్మీర్​ వివాదానికి.. పరిష్కారమని భారత్​ చెబుతున్నా, అది పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘనే."

- ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ ప్రధాని

కశ్మీర్​ వేర్పాటువాద నేత సయ్యద్ అలీ గిలానీ మృతదేహాన్ని కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా అధికారులు బలవంతంగా ఖననం చేశారని ఇమ్రాన్(India Pak news) ఆరోపించారు. ఆయనకు ఇస్లాం ఆచారాల ప్రకారం సరైన అంత్యక్రియలు జరిపించాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ (UNGA 2021 Pakistan)​ శాంతి కోరుకుంటుందని, అందుకు సహకరించాల్సిన బాధ్యత భారత్​పైనే ఉందని అన్నారు.

ముందు ఖాళీ చేయండి..

పాక్‌ ప్రధాని వ్యాఖ్యలపై భారత్ గట్టిగా (India UN) స్పందించింది. జమ్ముకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని మరోసారి స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్‌లో తీసుకొచ్చిన చట్టాలు, నిబంధనలు పూర్తిగా దేశ అంతర్గత వ్యవహారమని ఐరాసలో భారత ప్రతినిధి స్నేహా దుబే తేల్చి చెప్పారు. కశ్మీర్‌లో పాకిస్థాన్ ఆక్రమించుకున్న అన్ని ప్రాంతాలను ఖాళీచేయాలని ఘాటుగా బదులిచ్చారు.

ఐక్యరాజ్యసమితి భద్రతామండలి (యూఎన్​ఎస్​సీ) నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చిందని (Pakistan Sponsored Terrorism) దుబే తెలిపారు. ఉగ్రవాదులను పెంచే ఆ దేశ చర్యలతో ప్రపంచం మొత్తం నష్టపోయిందని, ఈ విషయం సభ్యదేశాలకు తెలుసని.. భారత్ పేర్కొంది (India slams Pakistan at UNGA). భారత్‌లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉందని వివరించింది. ఇతరుల అంతర్గత విషయాలపై మాట్లాడే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని.. భారత్ హితవు పలికింది.

పాకిస్థానే నష్టపోయింది..

ఇక తన ప్రసంగంలో (Imran Khan UN Speech) అమెరికా కృతజ్ఞతలేమి, అంతర్జాతీయ ద్వంద్వ వైఖరి వల్ల పాకిస్థాన్ (Pakistan news) ​బలైందని అన్నారు ఇమ్రాన్ ​ఖాన్. అమెరికాకు సాయం చేసినందుకు తామే నష్టపోయామని చెప్పారు.

"అఫ్గాన్​ ప్రస్తుత పరిస్థితులకు అమెరికా, ఐరోపా నేతలు పాకిస్థాన్​ను నిందిస్తున్నారు. కానీ, 9/11 దాడుల తర్వాత ఉగ్రవాదంపై అమెరికాతో యుద్ధంలో పాల్గొన్నందుకు అఫ్గాన్​ తర్వాత ఎక్కువగా నష్టపోయింది మా దేశమే. అమెరికాకు సాయం చేయడం వల్ల 80 వేల మంది పాకీస్థానీలు బలయ్యారు. దేశంలో అంతర్గత కలహాలు, అసమ్మతి ఎదురైంది. ఇంత చేసినా మాకు ప్రశంసల బదులు, అపనిందలే వస్తున్నాయి."

- ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ ప్రధాని

తాలిబన్లకు మద్దతివ్వండి (Pak support to Taliban)..

అంతర్జాతీయ సమాజం తాలిబన్లను ఒంటరి చేయొద్దని, అక్కడి ప్రజల కోసం వారి ప్రభుత్వాన్ని (Taliban Regime) బలోపేతం చేయాలని ఇమ్రాన్(India Pak news) కోరారు. ఓ వైపు కాళ్లు, చేతులు నరకడం లాంటి కఠిన శిక్షలు అమలు చేస్తామని తాలిబన్లు చెబుతుంటే.. వారు మానవ హక్కులను కాపాడతారంటూ చెప్పుకొచ్చారు ఇమ్రాన్.

ఇదీ చూడండి:ఉగ్రవాదానికి పాక్​ సాయంపై క్వాడ్​ నేతల ఆగ్రహం!

Last Updated : Sep 25, 2021, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details