తెలంగాణ

telangana

ETV Bharat / international

'పాకిస్థాన్​ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలి' - ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్​ సయీద్​

ఉగ్రవాద చర్యలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్​కు సూచించింది అగ్రరాజ్యం అమెరికా. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్​ సయీద్​ బ్యాంకు ఖాతాలపై ఉన్న ఆంక్షలను సడలించాలని పాక్​ ఐరాసను కోరింది. అతని కనీస అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాలని విన్నవించింది. ఈ నేపథ్యంలో పాక్​ను హెచ్చరిస్తూ.. ఈ వ్యాఖలు చేశారు అమెరికా విదేశాంగశాఖ దక్షిణాసియా వ్యవహారాల ప్రతినిధి ఆలీస్​వెల్స్​.

'పాకిస్థాన్​ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలి'

By

Published : Sep 28, 2019, 10:22 AM IST

Updated : Oct 2, 2019, 7:50 AM IST

పాక్​ భూభాగంలోని ఉగ్రవాద సంస్థలను అరికట్టే దిశగా ఇమ్రన్​ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అమెరికా మరోమారు హితవు పలికింది. పాకిస్థాన్​ స్థావరంగా జరగుతున్న ఉగ్ర దాడులను అరికట్టి.. ప్రాంతీయ సుస్థిరతను సాధించాలని సూచించింది అగ్రరాజ్యం.

ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్​ సయీద్​ను గతంలో అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది ఐరాస. అయితే తన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని.. కనీస అవసరాల కోసం డబ్బు తీసుకునే వెసులుబాటు కల్పించాలని పాక్​ను ఆశ్రయించాడు సయీద్​​.

ఈ నేపథ్యంలో సయీద్​ బ్యాంకు ఖాతాలపై ఉన్న ఆంక్షలు సడలించాలని ఐరాస భద్రతా మండలి అనుమతి కోరింది పాక్​. అందుకు ఐరాస అంగీకారం తెలుపుతూ.. ఉగ్రవాదాన్ని అరికట్టే దిశగా పాక్​ చర్యలు తీసుకోవాలన్నారు అమెరికా విదేశాంగ శాఖ దక్షిణాసియా వ్యవహారాల ప్రతినిధి ఆలీస్​వెల్స్.

Last Updated : Oct 2, 2019, 7:50 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details