కరోనా తీవ్రత తగ్గకపోగా... మరింత విజృంభిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో ఏకంగా మూడు లక్షలకు పైగా కేసులు బయటపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా 6,333 మంది మరణించారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3.20 కోట్లకు చేరింది. మరణాల సంఖ్య 9.81 లక్షలకు పెరిగింది.
కరోనా విలయం: ఒక్కరోజే మూడు లక్షల కేసులు
By
Published : Sep 24, 2020, 10:32 AM IST
ప్రపంచాన్ని ఆవహించిన కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టడం లేదు. ఒక్కరోజులో గరిష్ఠంగా మూడు లక్షలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. 6,333 మంది మరణించారు. ఫలితంగా కేసుల సంఖ్య 3.20 కోట్లకు పెరిగింది. అదే సమయంలో మరణాల సంఖ్య 9.81 లక్షలకు ఎగబాకింది.
మొత్తం కేసుల సంఖ్య-3,20,94,034
కొత్తగా వెలుగులోకి వచ్చిన కేసులు-3,15,717
మరణాలు-9,81,962
కోలుకున్నవారు-2,36,76,349
యాక్టివ్ కేసులు-74,33,736
అమెరికాలోనూ కొవిడ్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. తాజాగా 41 వేల కేసులు బయటపడ్డాయి. 1,112 మంది మరణించారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 71,39,553కు చేరింది. మరణాల సంఖ్య 2,06,593గా ఉంది.
దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్లో కొత్తగా 32 వేలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. 906 మంది కరోనాకు బలయ్యారు. ఫలితంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 46,27,780కి చేరుకుంది. మరణాల సంఖ్య 1,39,065కి పెరిగింది.
రష్యాలో 6,431 మందికి కరోనా సోకినట్లు వెల్లడైంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 11,22,241కి పెరిగిపోయింది. 150 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 19,799కి ఎగబాకింది.
మెక్సికోలో కరోనా తీవ్రంగా ఉంది. మరో 651మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 4,683 కరోనా బాధితులను గుర్తించారు. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 705,263కు చేరగా.. మరణాల సంఖ్య 74,348కి పెరిగింది.