తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​ అభిశంసనకు సగానికిపైగా అమెరికన్ల మద్దతు! - ట్రంప్ వార్తలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ అభిశంసన​ తీర్మానంపై బహిరంగ విచారణ సందర్భంగా ఏబీసీ న్యూస్-ఇప్సోస్ ఓ సర్వే నిర్వహించింది. ట్రంప్​ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని సగానికి పైగా అమెరికన్లు భావిస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. గతంలో జరిగిన సర్వేతో పోలిస్తే ట్రంప్​ను వ్యతిరేకించే వారు పెరిగినట్లు వెల్లడైంది. ట్రంప్​ ఏ నేరం చేయలేదనే వారి సంఖ్యలో కూడా పెరుగుదల నమోదు కావడం గమనార్హం.

ట్రంప్​ అభిశంసనకు సగానికిపైగా అమెరికన్ల మద్దతు!

By

Published : Nov 19, 2019, 12:09 PM IST

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకునే అవకాశం ఉందని అమెరికాలోని ఎక్కువ మంది ప్రజలు భావిస్తున్నారు. ట్రంప్​ అభిశంసన తీర్మానంపై బహింరంగ విచారణ జరుగుతున్న సందర్భంగా ఏబీసీ న్యూస్-ఇప్సోస్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న వారిలో 51 శాతం మంది ప్రజలు అమెరికా సెనెట్​లో ట్రంప్​ దోషిగా తేలాలని కోరుకుంటున్నట్లు స్పష్టమైంది. అభిశంసనకు సానుకూలంగా ఉన్నవారిలో 6 శాతం మంది ట్రంప్​ను అధ్యక్ష పదవి నుంచి తప్పించడానికి విముఖత చూపిస్తున్నట్లు తెలిసింది.

అభిశంసన తీర్మాణంపై విచారణ ప్రారంభానికి ముందు కంటే ఈ సంఖ్య పెరగడం గమనార్హం. అంతకు ముందు ఫైవ్​థర్టీఎయిట్ వెబ్​సైట్​ నిర్వహించిన సర్వేలో ట్రంప్​కు వ్యతిరేకంగా 48 శాతం మంది తమ అభిప్రాయాలు వెల్లడించారు.

రెండిట్లోనూ పెరుగుదల

ట్రంప్​ అభిశంసనకు వ్యతిరేకించే వారి సంఖ్య సైతం గణనీయంగా తగ్గింది. ఫైవ్​థర్టీఎయిట్​​ నిర్వహించిన సర్వేలో వీరి సంఖ్య 46 శాతం ఉండగా ఏబీసీ న్యూస్ సర్వేలో 38 శాతంగా నమోదైంది. సర్వేలో పాల్గొన్న వారిలో పావు శాతం మంది ట్రంప్​ ఎలాంటి తప్పు చేయలేదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

పద్దెనిమిదేళ్లు నిండినవారిలో 58 శాతం మంది అమెరికన్లు అభిశంసన ప్రక్రియను శ్రద్ధగా గమనిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. మిగిలిన 42 శాతం మంది అంతగా శ్రద్ధ కనబర్చడం లేదని సర్వే తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details