తెలంగాణ

telangana

ETV Bharat / international

సూది భయం.. కొవిడ్ టీకాకు ఆమడ దూరం - needle fear treatment

సూది అంటే చిన్నారులు ఆమడ దూరం పరిగెడతారు. అయితే.. ఇంజెక్షన్ అంటే భయం పిల్లలకే కాదు పెద్దలకూ ఉందని అధ్యయనాల్లో తేలింది. సూది గుచ్చుకుంటుందనే భయం కారణంగా సగం మందికి పైగా యువకులు కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోలేదని జార్జియాలోని అగస్టా విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు. అమెరికాలో 25 శాతం మందికి 'నీడిల్​ ఫోబియా' ఉన్నట్లు పేర్కొన్నారు.

unvaccinated for COVID-19
సూది భయంతో కొవిడ్ టీకాకు దూరం

By

Published : Jun 14, 2021, 5:54 PM IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ -19 వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్న క్రమంలో.. సూది గుచ్చుకుంటుందనే భయం కారణంగా చాలా మంది యువకులు టీకాలు తీసుకోవటం లేదని తాజా అధ్యయనాల్లో తేలింది. అమెరికాలో 25 శాతం మందికి ఇంజెక్షన్​ అంటే భయం, ఆందోళన వ్యక్తపరుస్తున్నారని జార్జియాకు చెందిన అగస్టా విశ్వవిద్యాలయం పరిశోధకులు తెలిపారు.

వ్యాక్సిన్ వేసుకున్న వారికి.. ఉచితంగా బీర్​లు, లాటరీ టికెట్లు ఇస్తామని.. ఆశ కల్పించినా.. చాలామంది భయంతో ముందుకు రావటంలేదు.

పెరుగుతున్న ఇంజెక్షన్​ భయం..

'నీడిల్​ ఫోబియా'పై మొదటగా 1995లో జేజీ హామిల్టన్​ అధ్యయనం చేశారు. ఆయన అందించిన నివేదిక ప్రకారం.. 10 శాతం మంది యువకులు, 25 శాతం మంది చిన్నారుల్లో ఇంజెక్షన్​ అంటే భయం ఉందని రుజువైంది. ఐదేళ్ల వయసు నుంచే సూది అంటే భయం ఏర్పడిందని వయోజనులపై చేసిన అధ్యయనంలో తేలింది.

1980 తరువాత పుట్టిన వారిలో.. 4-6 ఏళ్ల వయసున్న పిల్లలకు టీకా ప్రక్రియలో భాగంగా బూస్టర్ డోసులు అందించేవారు. ఈ బూస్టర్​ టీకాల కారణంగా రోగనిరోధక శక్తి రెట్టింపవుతుంది. కానీ అదే సమయంలో దురదృష్టవశాత్తు పిల్లల్లో 'సూది భయం(నీడిల్ ఫోబియా)' పెరిగింది.

2012లోని కెనడా అధ్యయనంలో 2000 సంవత్సరం లేదా ఆ తర్వాత జన్మించిన పిల్లల్లో 63 శాతం మందిలో నీడిల్ ఫోబియా పెరిగిందని తేలింది.

సూదంటే వారికీ భయమే..

2018 అధ్యయనం ప్రకారం.. 27 శాతం వైద్యసిబ్బందికి 'నీడిల్ ఫోబియా' ఉందని తేలింది. ఇటీవల కొవిడ్-19 వ్యాక్సినేషన్ సమయంలోనూ అమెరికాలోని యువ వైద్యులపై జరిపిన అధ్యయనంలో 52 శాతం మంది.. సూదంటే భయం, ఆందోళన ఉందని వెల్లడైంది.

ఇదీ చదవండి :Vaccination: 'అందరికీ టీకా వేస్తే ఉద్ధృతులకు బ్రేక్​'

'నీడల్ ఫోబియా' పోగొట్టేదెలా?

చిన్నారుల్లో సూది భయం పోగొట్టేందుకు.. టీకా ఇస్తున్న సమయంలో పిల్లలు ఆ ప్రక్రియను చూడకుండా దృష్టి మరల్చేలా చేయాలని అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యాక్సినేషన్ సమయంలో వీడియో గేమ్స్, పజిల్స్.. ఇలా మైండ్ గేమ్స్​కు సంబంధించిన వాటితో చిన్నారులు నొప్పిని గ్రహించలేరు.

మరి పెద్దలకైతే..?

నొప్పి తగ్గించే మార్గాలు..

టీకా సమయంలో నొప్పి తెలియకుండా ఉండేందుకు.. మత్తు ఇవ్వటం, అతి చల్లని పరికరాన్ని వ్యాక్సిన్ వేసే దగ్గర ఉంచటం వల్ల నొప్పి తెలియదు. ఇవి నీడిల్ భయం పోగొట్టే ఉత్తమమైన పద్ధతులు.

ఇదీ చదవండి :టీకా వేసుకోరా? అయితే ఫోన్‌ బ్లాక్‌, జీతం కట్​!

మాససిక చికిత్స..

మానసిక చికిత్స వల్ల నీడిల్ అంటే ప్రజల్లో ఉన్న భయం, ఆందోళనను క్రమంగా పోగొట్టవచ్చు. పదునైన వస్తువులపై అవగాహన కల్పిస్తూ.. ప్రశాంతమైన వాతావరణంలో వారికి టీకాలు వేయవచ్చు.

దృష్టి మరల్చటం..

చిన్నారుల్లానే.. పెద్దలకు సైతం మైండ్ గేమ్స్​, వర్చువల్ గేమ్స్, పజిల్స్, వీడియోల ద్వారా కొంతమేర టీకాపై దృష్టి మరల్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో వారి రక్తప్రసరణ కుదుట పడి ఆందోళన, భయం తగ్గుతుంది.

ఇదీ చదవండి :Vaccination: డ్రోన్లతో పల్లెలకు టీకాలు

ABOUT THE AUTHOR

...view details