అమెరికాలో కరోనా వైరస్ ఉద్ధృతి ఆందోళనకరంగానే ఉంది. అయితే పిల్లలకు కూడా కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. జులై చివరి రెండు వారాల్లో 97,000కుపైగా మంది చిన్నారులు కరోనా బారినపడినట్టు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అసోసియేషన్ నివేదించింది.
జులై 16-30 మధ్య కాలంలో 97,078మంది చిన్నారులకు వైరస్ నిర్ధరణ అయ్యింది. ఇది 40శాతం ఎక్కువని నివేదిక పేర్కొంది.
కేసుల నమోదవుతున్న రాష్ట్రాల్లో చిన్నారుల ప్రాతినిధ్య కేవలం 8.8శాతమే అయినప్పటికీ.. ఇప్పటివరకు 3,38,000మందికిపైగా పిల్లలు వైరస్ బారినపడినట్టు నివేదిక తెలిపింది.