అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత (Afghan crisis) ఇప్పటి వరకు 82 వేల మందిని సురక్షితంగా ఆ దేశం (Evacuation from Afghan) నుంచి తరలించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ తెలిపారు. ఇందులో 19 వేల మందిని బుధవారం ఒక్కరోజే తరలించినట్లు వెల్లడించారు.
ఆగస్టు 14 నుంచి తరలింపు ప్రక్రియ ప్రారంభమవగా.. దాదాపు 6,000 మంది అమెరికన్లు అఫ్గాన్‌ను వీడాలనుకుంటున్నట్లు అమెరికా అంచనా వేసింది. ఇందులో 4,500 మందిని ఇప్పటికే తరలించింది. మరో 1500 వందల మంది అమెరికా పౌరులను ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ విధించిన గడువు (ఆగస్టు 31)లోపే (US deadline to leave Afghan) తరలించే అవకాశముందని బ్లింకెన్ తెలిపారు. అయితే చాలా ఏళ్లుగా తమకు అండగా ఉన్న అఫ్గాన్ వాసులతో పాటు.. స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న అమెరికన్లకు సాయపడానికి మాత్రం తమకు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేశారు. ఇందుకోసం ఆగస్టు 31 తర్వాత కూడా తరలింపు ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.
అఫ్గాన్‌కు అమెరికా చట్టసభ్యులు..