అమెరికాలో నవంబర్ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల హడావుడి తారస్థాయికి చేరింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నికల కోసం అధ్యక్ష అభ్యర్థులు భారీ స్థాయిలో ప్రచారాలు సాగిస్తున్నారు. అదే సమయంలో ముందస్తు పోలింగ్ కూడా జోరుగా సాగుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అనేకమంది ప్రజలు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా టెక్సాస్‌లోని ఓటర్లు భారీగా తరలివెళ్లి ఓట్లు వేస్తున్నారు.
శతాబ్దానికే రికార్డు..!
టెక్సాస్‌లో ఈ నెల 13న ముందస్తు పోలింగ్ మొదలైంది. అతి తక్కువ రోజుల్లోనే రికార్డు స్థాయిలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ఇప్పటివరకు 7మిలియన్ ఓట్లు పోల్ అయ్యాయి. ఇది ఆ రాష్ట్ర ఓటర్ల జాబితాలో 43శాతం. దీంతో టెక్సాస్‌లో మొత్తం పోలింగ్ శాతం.. ఈ శతాబ్దంలో ఇప్పటివరకు ఎన్నడూ చూడని విధంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి:-అమెరికా ఓటర్లకు ఇరాన్ 'ఈమెయిల్' బెదిరింపులు!
ఆదివారం నాటికి 25,658మంది ఓట్లు వేశారు. 560 మెయిల్ బ్యాలెట్లు అందాయి. మరోవైపు ఒక్క హ్యారిస్ కౌంటీలోనే 10,90,445మంది బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గెలుపెవరిది?